అనిల్‌కపూర్ కొడుకుపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

అనిల్‌కపూర్ కొడుకుపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు

November 21, 2019

Tapsee Comments On Anil Kapoor Son

సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది సర్వసాధారణం. చాలా కాలంగా అగ్రహీరోలు తమ వారసులను రంగుల ప్రపంచంలోకి దింపి ఎలాగోలా వారిని వెండితెరకు పరిచయం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిపై ఇటీవల హీరోయిన్ తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ కిడ్ కాకపోయి ఉంటే ఏ హీరోకు అసలు కెరీర్ ఉండేది కాదని ఆమె వ్యాఖ్యానించారు. నో ఫిల్టర్ నేహా అనే ఛాట్ షోలో ఈ కామెంట్ చేశారు. ఓ స్టార్ హీరో కొడుకును ఉదాహరణగా తీసుకొని ఈ విధంగా స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి.

బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ కొడుకు హర్షవర్థన్ కపూర్ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ‘హర్షవర్ధన్ కపూర్ విషయంలో అతని తొలి సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ రెండో సినిమాలో అవకాశం వచ్చింది. అతడు ప్రముఖ నటుడి కొడుకు కావడం వల్లే ఇలా జరిగింది. అదే స్థానంలో నేను ఉంటే అలా జరిగేది కాదు. పూర్తిగా కెరీర్ ఉండకపోయేది’ అంటూ వ్యాఖ్యానించారు.  హర్షవర్థన్ కపూర్‌నే ఆమె ఎందుకు టార్గెట్ చేసి ఉంటారని బాలీవుడ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.