బిగ్ బాస్ ఇంట్లోకి  తాప్సీ ? - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్ ఇంట్లోకి  తాప్సీ ?

August 17, 2017

బిగ్ బాస్ ఇంట్లోకి  దారేది…అని మరికొంతమంది సెలబ్రిటీలు ఇంట్లోకి అడుగుపెట్టడానికి తయారవుతున్నారు.తాజాగా  తాప్సీ బిగ్ బాస్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కంటస్టెంట్ గా కాదట,తాప్సీ నటిస్తున్న ఆనందో బ్రహ్మ సినిమా ప్రమోషన్ కోసమట,మొన్నటి వారం  రానా.. నేనే రాజు నేనే మంత్రి  సినిమా ప్రమోషన్ కోసం  బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు.ఇప్పుడు తాప్సీ నటించిన కొత్త సినిమా ఆనందో బ్రహ్మ మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వనుంది.దాని ప్రమోషన్ కోసం ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడుతుందనే వార్త నెట్ లో హల్ చల్ చేస్తుంది .దీన్ని బట్టి కొత్తసినిమాల ప్రచార వేదికగా బిగ్ బాస్ అవుతుందనే చెప్పాలి.ఈ షోకు అత్యధిక టీఆర్పీ రేటింగులు ఉండడంతో యాక్టర్స్ వాళ్ల సినిమాకోసం ఇక్కడికి వస్తున్నారట. మరి రాబోవు రోజుల్లో ఇంకెంత మంది వాళ్ల సినిమా ప్రమోషన్ల్ కోసం బిగ్ బాస్ హౌస్ ను వాడుకుంటారు చూడాలె.