హిందీలో మాట్లాడు అన్నందుకు తాప్సీ  సూపర్ కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

హిందీలో మాట్లాడు అన్నందుకు తాప్సీ  సూపర్ కౌంటర్

November 24, 2019

ఇటీవల ఓ స్టార్ హీరో కొడుకుపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన బాలీవుడ్ నటి తాప్సీ మరోసారి వార్తల్లోకి వచ్చారు. అయితే ఈసారి వివాదంతో కాకుండా సమస్పూర్తితో వ్యవహరించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. హిందీలో మాట్లాడాలని ఓ వ్యక్తి చేసిన కామెంట్‌కు ఆమె దిమ్మతిరిగే రిప్లే ఇచ్చారు. 

గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకలకు ఆమె వచ్చారు. అక్కడ ‘ఉమెన్ ఇన్ లీడ్’ అనే అంశంపై మాట్లాడే సమయంలో ఆడియన్స్ తో సరదాగా అందరికీ హిందీ అర్థం అవుతుందా అని అడిగారు. వెంటనే వారు లేదు అని సమాధానం ఇచ్చారు. ఆ వెంటనే అక్కడే ఉన్న మరో వ్యక్తి బాలీవుడ్ హీరోయిన్ అయినందున హిందీలోనే మాట్లాడాల అంటూ కోరాడు.

వెంటనే అతని మాటలకు ‘మీరు అన్నది కరెక్టే కానీ నేను దక్షిణాది భాషల్లోనూ నటించాను. ఆ భాషల్లో మాట్లాడమంటారా.?’ అంటూ ప్రశ్నించారు. ఆమె మాటలకు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. సమయస్పూర్తితో సాటిలేని సమాధానం చెప్పారంటూ పలువురు వ్యాఖ్యానించారు. ఇప్పుడదని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తాప్సీ పలు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయారు.