కుండ బద్దలు కొట్టిన తాప్సీ - MicTv.in - Telugu News
mictv telugu

కుండ బద్దలు కొట్టిన తాప్సీ

July 11, 2017

ఈ మధ్య తాప్సీ ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇస్తూ అందులో తెలుగు సినిమాల గురించి చాలా ఘాటుగానే విమర్శించింది. అవసరం లేకపోయినా బలవంతంగా కొన్ని సీన్స్ చిత్రీకరిస్తారు. హీరోయిన్ల బొడ్డు మీద, నడుము మీద, చెప్పరాని చోటల్లా పూలు పళ్ళు వేసి అనవసరంగా షూట్ చేస్తారేమో అనిపిస్తుంది. తెలుగు డైరెక్టర్లు కొంచెం సెన్స్ లెస్ గా సినిమాలు తీస్తారని కూడా ఘాటుగా విమర్శించింది. కానీ ఎవరన్నది పేరు పెట్టి మాత్రం అనలేదు. తను పూలూ, పళ్లు అన్నదంటే ఎవరికైనా ఠక్కున వెలిగే నేమ్ కె. రాఘవేంద్రరావే. ఆయనే కదా ‘ ఝుమ్మంది నాదం ’ సినిమాతో తాప్సీని సినిమా రంగానికి పరిచయం చేసింది. అప్పటి తన మెమెరీస్ ను తలుచుకొని ఇలా మాట్లాడింది తాప్సీ అంటున్నారు. ఉన్నది ఉన్నట్టు తెగేసి చెప్పి కుండ బద్దలు కొట్టానని తాప్సీ పన్ను తెగ సంబరపడ్డా తెలుగు సినిమా పెద్దలు తాప్సీ మాటలను చాలా సీరియస్ గా తీస్కుంటున్నారు. తనను హీరోయిన్ గా తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ ను ఇలా పరోక్షంగా విమర్శించడం అస్సలు బాగా లేదని అంటున్నారు. చూడాలి మరి తాప్సీ మాటలను మనసులో పెట్టుకొని తెలుగు సినిమా దర్శకులు ఆమెను తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా తీస్కుంటారో, పక్కన పెట్టేస్తారో !?