సల్మాన్ - తాప్సీ కాంబినేషన్ కలిసొచ్చేనా ! - MicTv.in - Telugu News
mictv telugu

సల్మాన్ – తాప్సీ కాంబినేషన్ కలిసొచ్చేనా !

July 4, 2017


‘ ఝుమ్మంది నాదం ’ సినిమాతో తెలుగులో ఒక ఊపు ఊపిన తాప్సి ఎప్పుడెప్పుడు బాలీవుడ్ కు పోదామా అని తెగ ఉగ్గపట్టుకొని వున్న తన కోరిక నెమ్మదిగా తీరుతూనే వున్నట్టుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన నటించే బిగ్ ఆఫర్ ను కొట్టేసి అస్సలు ఆగలేనట్టు గాల్లో తేలిపోతోంది ముద్దుగుమ్మ. ‘ జుడువా 2 ’ సినిమాలో ఏకంగా సల్మాన్ సరసన ఛాన్స్ కొట్టేసింది తాప్సీ పన్ను. ఈ సినిమాలో వరుణ్ ధావన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తుండటం విశేషం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో కరిష్మాకపూర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తోందట.
90 దశకంలో వచ్చిన జుడువా సినిమాకు ఈ సినిమా సీక్వెల్. దీనికి డైరెక్టర్ వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్. అయితే ఇక్కడ తాప్సీ గురించి మాట్లాడుకుంటే తాప్సీ సల్మాన్ సినిమాలో ఛాన్స్ వచ్చేసరికి ఎగిరి గంతేస్తోంది కరెక్టే కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం వుండదని గ్రహించలేకపోతోంది. ఎందుకంటే సల్మాన్ పక్కన చేసిన ఏ హీరోయినూ స్టార్ హీరోయిను అవదని గ్రహించుకుంటే తనకు ఇంత సంబురం వుండదేమో.
అప్పట్లో ఆసిన్ కూడా వర్సగా సల్మాన్ పక్కన రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చేసరికి ఇలాగే సంబరపడి, వచ్చిన తెలుగు, తమిళ సినిమా అవకాశాల కేర్ లెస్ చేసి చివరికేమైందీ ? ఎటూ కాకుండా బుద్ధిగా పెళ్ళి చేస్కొని సెటిలైంది ! తాప్సి ఆనందాన్ని చూసిన టాలీవుడ్ విశ్లేషకులు కూడా తాప్సీలో అసిన్ ను చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నారు. చూడాలీ తాప్సీ బేబీ తన పేరును నామ్ షబానాగా మార్చుకొని స్టార్ హీరోయిన్ అవుతుండొచ్చు !