Taraka Ratna : Interesting Facts about Taraka Ratna Life History
mictv telugu

తారకరత్న జీవిత విశేషాలు

February 19, 2023

ఫిబ్రవరి 22, 1983 హైదరాబాదులో జన్మించారు. ఇతని తండ్రి నందమూరి మోహన కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. తల్లి నందమూరి శాంతి మోహన్. 2012లో నందీశ్వరుడు సినిమాకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేసిన అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. దీన్ని ఇంట్లో వాళ్లు వ్యతిరేకించారు. ఎందుకంటే అలేఖ్యరెడ్డికి అంతకుముందే పెళ్లయి విడాకులు తీసుకున్నందున వ్యతిరేకించడంతో అప్పటినుంచి తారకరత్న పేరెంట్స్ నుంచి విడిగా ఉంటూ వస్తున్నారు. ఈ దంపతులకు 2013లో కూతురు పుట్టింది. 2001లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒకేసారి 9 సినిమాలను ప్రారంభించి ప్రపంచరికార్డు సృష్టించాడు. 2016లో 1.50 కోట్ల కారు కొనుక్కొని నర్సరావుపేటలో 6 లక్షలు పెట్టి 9999 ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్నారు. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. 2009లో అమరావతి చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకు గాను ఉత్తమ ప్రతినాయకుడుగా నంది అవార్డు అందుకున్నారు. నందమూరి మనవడైన తారకరత్న ఒక్కడే సంతానం.!