చిన్న వయుస్సులోనే ప్రజలకు ఏదో సేవ చేయాలనుకున్న వ్యక్తి తారకరత్న అని చంద్రబాబు అన్నారు.మంచి వ్యక్తిని కోల్పోయామని చెప్పారు. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.”తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి. మంచి భవిష్యత్ ఉన్న నటుడిని కోల్పోయం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని నాతో చెప్పాడు. అవకాశం ఇద్దామనుకున్నాం. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుందాం అని చెప్పా. ఈలోపే చనిపోవడం బాధాకరం. కుటుంబం, అభిమానులు ప్రార్థించినా ఫలితం లేకుండా పోయింది. ఈనెల 22వ తేదికి తారకరత్నకు 40 సంవత్సరాలు. తారకరత్న పిల్లలను చూస్తే చాలా బాధగా ఉంది. భగవంతుడు ఆ కుటుంబానికి అండగా ఉండాలి. మేము కూడా అండగా నిలుస్తాం. తారకరత్న ఏ ఆశయాల కోసం పనిచేశారో వాటిని ముందుకు తీసుకెళ్లేలా అభిమానులు కృషి చేయాలి. సినిమా రంగంలో ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించిన ఘనత తారకరత్నది. అమరావతి సినిమాలో నటనకు నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ” అని చంద్రబాబు తెలిపారు.