నందమూరి వంశం నుండి 11ఏళ్ళ కింద హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తారక రత్న. అప్పటి నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న తారకరత్న సడెర్న్ గా టీడీపీలో యాక్టివ్ అయ్యారు. కొద్దీ రోజుల క్రితం నారా లోకేష్ తో భేటీ అయ్యి.. నారా కుటుంబానికి జై కొట్టేశాడు. నిన్న మొదలైన లోకేష్ పాదయాత్రలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. బాబాయ్ బాలయ్య బాబుతో కార్యకర్తలని ఉత్సాహపరుస్తూ.. సాగుతున్న పాదయాత్రలో అనుకోకుండా కుప్పకూలిపోయాడు తారకరత్న. దాంతో హుటాహుటిన తారకరత్నని ఆసుపత్రికి తరలించగా.. గుండెపోటు అని తేల్చేశారు డాక్టర్లు. ఆ వెంటనే కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు బెంగుళూరుకి తరలించి చికిత్స చేస్తున్నారు. ఇప్పటికి క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నారు తారక్. ఈ నేపథ్యంలో తారకరత్న త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కోరుకుంటూ.. ఆయన రికార్డులని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నందమూరి కుటుంబంలో తారకరత్న ఒక ఫెయిల్యూర్ హీరో అయినా.. ఆయన పేరుపై ఒక వరల్డ్ రికార్డు ఉంది. ఇతర హీరోలెవరు కూడా టచ్ చేయలేని అసాధ్యమైన రికార్డు తారక్ సొంతం.
ప్రస్తుత యూత్ తారకరత్న ఉన్నాడన్న విషయం మరిచిపోయి ఉండొచ్చు కానీ.. తారకరత్న సినీ ఎంట్రీ టాలీవుడ్ లో ఒక సంచలనం. ‘ఒకటో నంబర్ కుర్రాడు’ మూవీ ఓపెనింగ్ రోజే ఏకంగా 9సినిమాలని ప్రకటించాడు తారకరత్న. ఇదొక వరల్డ్ రికార్డు. ఇండస్ట్రీకి ఎవరైనా ఒక సినిమాతో ఎంట్రీ ఇస్తారు.. లేదంటే రెండు సినిమాలతో వస్తారు. కానీ ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన హీరో నందమూరి తారక రత్న. అప్పట్లో ఇదో పెద్ద సంచలనం. అయితే ప్రకటించిన 9సినిమాల్లో ఎక్కువ శాతం రిలీజ్ కాలేదు. ఒకటో నంబర్ కుర్రాడు తరువాత.. యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలినవన్నీ ఆగిపోయాయి. వీటిలో ఒక్కటి కూడా హిట్ కాకపోవటంతో.. కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని అమరావతి సినిమాతో విలన్ అయ్యాడు. అయితే ఆ సినిమా కూడా నిరాశ మిగల్చటంతో.. ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇలా వచ్చాడో లేదో తారకరత్నకి ఇలా జరగటం తీవ్ర విచారకరం.
ఇవి కూడా చదవండి :
బెంగుళూరుకి ఎన్టీఆర్.. తారకరత్న పరిస్థితి విషమం ?
మూడున్నర ఏళ్ళకు.. ‘సువర్ణ సుందరి’కి మోక్షం ..!
నీ మూడు పెళ్లిళ్ల గోల ఏంటీ బయ్యా.. బాలయ్య ప్రశ్నకి పవన్ షాక్..!