Tarakaratna will be the villain in Mahesh Babu's next film
mictv telugu

మహేశ్ – త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా నందమూరి నటుడు

May 28, 2022

Tarakaratna will be the villain in Mahesh Babu's next film

సర్కారు వారి పాట సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా అవడంతో అంచనాలు చాలా ఉన్నాయి. ఇంతకు ముందు ఇద్దరు చేసిన సినిమాలు హిట్ కావడంతో తాజా చిత్రంపై అంచనాలు చాలా ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా కన్ఫర్మ్ కాగా, మరో నటికి సినిమాలో అవకాశముందని తెలుస్తోంది.

ఈ సినిమాకు అర్జునుడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మే 31 వ తేదీన కృష్ణ బర్త్ డే సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. అయితే విలన్ పాత్ర ఎవరు చేస్తున్నారో ఇంతవరకు బయటికి రాలేదు. అయితే నందమూరి కుటుంబానికి చెందిన తారకరత్న ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్నట్టు కన్‌ఫర్మ్ అయింది. ఈ విషయాన్ని తారకరత్ననే స్వయంగా తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ చేసి విలనిజానికి సంబంధించిన ఎమోజీని జత చేశాడు. కాగా, గతంలో తారకరత్న రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అమరావతి చిత్రంలో తొలిసారి విలన్‌గా నటించారు. అందులో నటనకు గాను ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డును బెస్ట్ విలన్ కేటగిరీలో గెలుచుకున్నారు.