Tarakaratna's last rites in Mahaprasthan
mictv telugu

ఆస్పత్రిలో అలేఖ్య.. ముహూర్తం పెట్టిన బాలక‌ృష్ణ : విజయసాయి రెడ్డి

February 19, 2023

నందమూరి తారకరత్న మరణం తనను ఎంతగానో బాధించిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన అంత్యక్రియలపై క్లారిటీ ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. భార్య అలేఖ్య మానసిక ఒత్తిడికి గురైందని దాంతో కాళ్లు, చేతులు వణుకుతున్నాయని స్పష్టం చేశారు.

ఎంతగానో ప్రేమించిన భర్త మరణించడంతో తీవ్ర మనోవేదన అనుభవిస్తోందని, కొంతకాలం తర్వాత మామూలు మనిషి అవుతారనే అశాభావం వ్యక్తం చేశారు. ‘చిన్నాపెద్దా తేడా లేకుండా అందరితో మంచిగా మెలిగిన అద్భుత వ్యక్తి తారకరత్న. ప్రతీఒక్కరినీ అప్యాయంగా పిలిచేవారు. రాజకీయాల్లో ప్రవేశించాలని భావిస్తున్న సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం. ఆస్పత్రిలో ఉన్నప్పుడు బాలకృష్ణ చాలా శ్రద్ధ తీసుకున్నారు. చికిత్సలో ఎలాంటి లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే తారకరత్న కుటుంబం తన కుటుంబంలో భాగమని భరోసా ఇచ్చారు. అన్నింటికీ అండగా నిలుస్తానని మాటిచ్చారు. అందుకు ఆయన రుణపడి ఉంటారు. అభిమానుల కోసం సోమవారం ఉదయం 9.03 గంటలకు తారకరత్న భౌతికకాయాన్ని ఫిలింఛాంబర్ వద్దకు తరలిస్తాం. బాలకృష్ణగారు పెట్టిన ముహూర్తం ప్రకారమే సాయంత్రం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామ’ని వెల్లడించారు.