చార్జీల పెంపు ఎఫెక్ట్..జియోకు భారీగా తగ్గిన చందాదారులు - MicTv.in - Telugu News
mictv telugu

చార్జీల పెంపు ఎఫెక్ట్..జియోకు భారీగా తగ్గిన చందాదారులు

February 26, 2020

cb ng

రిలయన్స్‌ జియో గత ఏడాది అక్టోబర్‌లో టారిఫ్‌‌ ప్లాన్‌లను పెంచిన సంగతి తెల్సిందే. దీంతో జియో డిసెంబరు నెలలో కొత్త వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) తెలిపింది. నవంబరు నెలలో 5లక్షల 60 వేల కొత్త చందారులను జత చేసుకున్న జియో డిసెంబర్ నెలలో 82,308 మంది ఖాతాదారులను మాత్రమే నమోదు చేసింది. 

ట్రాయ్ డిసెంబర్ 31, 2019తో ముగిసిన నెలలో భారతీయ టెలికాం కంపెనీల చందాదారుల సమాచారాన్ని బుధవారం విడుదల చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్ డిసెంబర్ నెలలో సుమారు 4,26,958 మంది కొత్త చందాదారులను చేర్చుకుని జియోను వెనక్కి నెట్టింది. అయినప్పటికీ రిలయన్స్ జియో ఇప్పటికీ మార్కెట్ వాటాలో 32.14 శాతంతో టాప్‌లో ఉండగా, వొడాఫోన్ ఐడియా 28.89 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో ఉంది. 28.43 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో ఎయిర్‌‌టెల్‌ వుంది.