మహేష్ బాబు అభిమానుల ట్రోలింగ్.. తరుణ్ భాస్కర్ ఫిర్యాదు..  - MicTv.in - Telugu News
mictv telugu

 మహేష్ బాబు అభిమానుల ట్రోలింగ్.. తరుణ్ భాస్కర్ ఫిర్యాదు.. 

July 1, 2020

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. హీరో మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా వివాదం నడుస్తోంది. ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. తమ హీరోపై పరోక్ష్యంగా వ్యాఖ్యలు చేశాడంటూ తిట్టిపోశారు. దీనిపై తరుణ్ భాస్కర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తీరా ఇది పెద్దది కావడంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను దుర్భాషలాడుతూ.. బెదిరించారని అందులో పేర్కొన్నాడు. ఫిర్యాదు తీసుకొని విచారణ పోలీసులు పోస్టుల వివరాల ఆధారంగా విచారణ ప్రారంభించారు. 

ఇంతకీ తరణ్ భాస్కర్ ఈ వివాదంలో ఇరుక్కోవడానికి ఓ కారణం ఉంది. ఇటీవల మళయాలంలో వచ్చిన ‘కప్పెల’ సినిమాపై రివ్యూ రాశాడు. అందులో ‘హీరో అరవడాలు లేవు, మాస్ అప్పీల్ లేదు. అనవసరపు సన్నివేశాలు లేవు. ప్రతి డైలాగ్‌లో సామెత చెప్పడు. ఫిజిక్ ఫెయిలయ్యేలా ఫైట్లు ఉండవు. చివరి పది నిమిషాల్లో రాండమ్‌గా రైతుల గురించో, సైనికుల గురించో, దేశం గురించో మెసేజ్ ఉండదు. ’ అంటూ కమర్షియల్ సినిమాలపై కౌంటర్లు వేశాడు. ఇది చూసిన మహేష్ అభిమానులు మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలపై పరోక్షంగా కౌంటర్ వేశాడని అనుకొని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఫేక్ ఐడీలతో బూతులు తిడుతూ, బెదిరింపులకు కూడా దిగారు. వీటితో విసిగిపోయిన ఆయన అదే స్థాయిలో తిట్టిపోశాడు. ఇది కాస్తా పెద్దది కావడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. మొత్తానికి తరుణ్ భాస్కర్ రివ్యూ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపింది.