tarun chugh reaction on cm kcr comments on bjp
mictv telugu

కేసీఆర్‌కు ప్రధాని కావాలని మోజు..అందుకే ఈ డ్రామా: తరుణ్ చుగ్

November 4, 2022

సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆరాటపడుతున్నారని.. అందుకే ఫామ్ హౌస్ డ్రామాకు తెరలేపారన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్చుగ్. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుతో అసలు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో సంచలనం రేపిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ వ్యవహారంపై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ తన ఫామ్హౌజ్లో అద్భుతమైన సినిమా కథ అల్లారని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కేసీఆర్‌కు నమ్మకం లేదని, తన పార్టీ గురించి ఆందోళన చెందుతున్నారని విమర్శించారు.

తన పాపాల గురించి.. ప్రజల గురించి భయాందోళన చెందుతున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. కేసీఆర్‌ సర్కారు పాపాలకు.. ప్రజలు తప్పకుండా బదులిస్తారని పేర్కొన్నారు. ప్రధాని మోడీపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలు మోదీకి అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి కావాలని కోరుతున్నారని స్పష్టం చేశారు. ఫామ్‌హౌస్ వ్యవహారం బయటికొచ్చినప్పుడే.. బీజేపీకి ఆ విషయం గురించి సంబంధం లేదని యాదాద్రిలో బండి సంజయ్‌ ప్రమాణం చేశారని.. టీఆర్ఎస్ నేతలు నిజాయతీగా ఉంటే ప్రమాణం ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు.