Taste for taste, health for health these weight loss smoothies
mictv telugu

రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ వెయిట్ లాస్ స్మూతీలు

November 12, 2022

జిమ్‌లో ఫుల్‌గా కేలరీలు బర్న్ చేశాక ఆకలి వేస్తుంది. అప్పుడు ఏవేవో బిస్కెట్స్, చిప్స్ వంటివి తినే బదులు టేస్టీ స్మూతీస్ తీసుకుంటే…భలే ఉంటుంది కదూ. స్మూతీలు రుచిగా ఉండడమే కాదు బరువు తగ్గేందుకు కూడా ఇవి బాగా పనిచేస్తాయి. ఎందుకంటే అవసరమైన పోషకాలు అందించడంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండేలా చేస్తాయి కాబట్టి. అంతేకాదు ఇవి త్వరగా కూడా రెడీ అవుతాయి. అందుకే అందరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అనుకున్న విధంగా వెయిట్‌లాస్ గోల్స్‌కి రీచ్ కావొచ్చు.

వెయిట్ లాస్….ఇప్పుడు ఇది అందరికీ ఓ పెద్ద సవాల్. చాలా మంది రకరకాలుగా దీనికోసం తాపత్రయపడుతుంటారు. జిమ్ లకు వెళతారు, పరిగెడతారు, నడుస్తారు, యోగా చేస్తారు….ఇంకా ఏమేమో చేస్తారు. అయితే ఇవి చేయడంతో పాటు సరైన ఫుడ్ తీసుకోవాలన్న విషయం మీద దృష్టి పెట్టరు. మనం ఎంత వర్కౌట్స్ చేస్తామో అంతే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే వెయిట్ లాస్ కరెక్ట్ గా అవుతుంది. అచ్చంగా అలాంటి వారికోసమే ఈ కిది స్మూతీ రెసిపీలు.ఆరోగ్యంతో పాటూ సూపర్ టేస్టీగా ఉండే వీటిని అందరూ ఈజీగా చేసేసుకోవచ్చు కూడా.

పీనట్ బటర్ స్మూతీ

వెయిట్ లాస్ కి బెస్ట్ ఆప్షన్. పీనట్ బటర్‌లో ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్, ఫైబర్, ఇతర అవసరమైన విటమిన్స్, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఓ బ్లెండర్ తీసుకుని 1 కప్పు తియ్యని బాదం మిల్క్, అరకప్పు స్ట్రాబెర్రీస్, 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్, 1 స్కూప్ వెనీలా ప్రోటీన్ పౌడర్ వేసి మాంచి టెక్చర్ వచ్చేవరకూ బ్లెండ్ చేసి ఎంజాయ్ చేయడమే.

బ్లూబెర్రీ స్మూతీ

బరువు తగ్గేందుకు బ్లూ బెర్రీస్ బెస్ట్ ఆప్షన్. బ్లూ బెర్రీస్ కొవ్వుని కరిగించి, నిల్వని నియంత్రించే జన్యువులను ప్రభావితం చేస్తాయని అధ్యయనాలు సూచించాయి. ఇది బెల్లీ కొవ్వుని తగ్గించడంలో, హై కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడతాయి. బ్లెండర్‌లో 1 కప్పు తియ్యని బాదం మిల్క్ 1 కప్పు బ్లూబెర్రీస్, 1 స్కూప్ వెనిల్లా ప్రోటీన్ పౌడర్ వేసి బ్లెండ్ చేస్తే బ్లూ బెర్రీ స్మూతీ నిమిషాల్లో రెడీ అయిపోతుంది.

చాక్లెట్ స్మూతీ

ఈజీగా దొరికే పదార్థాలతోనే మాంచి చాక్లెట్ స్మూతీని చేసుకోవచ్చును. దీనికోసం 1 కప్పు స్వీట్ బాదం మిల్క్‌ని బ్లెండర్‌లో వేయండి. తీపి కావాలనుకుంటే చక్కెర బదులు బెల్లం పొడి, తేనె కలపడం మంచిది. ఇందులోనే అరటిపండు ముక్కలు, 1 లేదా 2 టీ స్పూన్ల కాఫీ, 1 లేదా 2 టీ స్పూన్ డార్క్ కొకో పౌడర్, చివరగా, 1 స్కూప్ వెనీలా ప్రోటీన్ పౌడర్ వేసుకుంటే రెడీ అయిపోతుంది. టేస్టీ చాక్లోట్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చును.

గ్రీన్ స్మూతీ

ఆకుపచ్చ కూరగాయలతో కూడా స్మూతీలను చేసుకోవచ్చు. బ్లెండర్‌లో 1 కప్పు తియ్యని బాదం మిల్క్ తీసుకొని… ఇందులోని ఓ అరటిపండు 1 కప్పు పాలకూర, 1 స్కూప్ వెనీలా ప్రోటీన్ పౌడర్ వేసి చక్కగా బ్లెండ్ చేయాలి. తరువాత…ఇంకేంటి ఆలస్యం ఆస్వాదించడమే. ఇందులో మనకు నచ్చిన ఆకుకూరలు ఏమైనా యాడ్ చేయొచ్చు. అయితే టేస్ట్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోవాలి.

వెనీలా స్మూతీ

ఇది మాంచి రిఫ్రెష్ ఫీల్‌ తో పాటూ ఫ్రూటీ పంచ్, క్రీమీ టెక్చర్ వెనిల్లా రుచి ఓ రేంజ్‌కి తీసుకెళ్తుంది. ఈ స్మూతీని తయారు చేసేందుకు 1 కప్పు స్వీట్ ఆల్మండ్ మిల్క్, దానిలో అరకప్పు మామిడి ముక్కలు, అరకప్పు పైనాపిల్ వేయాలి. 1 స్కూప్ వెనిల్లా ప్రోటీన్ పౌడర్ వేసి.. బ్లెండ్ చేయండి. రుచికరమైన స్మూతీని ఎంజాయ్ చేయడమే.. మామిడిపండ్లు లేకపోతే సీజనల్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు.

మనం డైట్ అంటూ మన రుచులను వేటినీ చంపేసుకోవక్కర్లేదు. నోరు కట్టుకుని కొవ్వుని తగ్గించేసుకునే పనే అస్సలు లేదు. హ్యాపీగా ఇలాంటి స్మూతీలను తాగుతూ మరీ తగ్గిపోవచ్చు. ఇంకేంటి ఆలస్యం ఆరోగ్యంగా తినండి, తాగండి….ఎంజాయ్ చూస్తూ వెయిట్ లాస్ అవ్వండి.