కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి అని సామెత. అర్ధరాత్రి తీటతో గాడిదలా అరిచి మక్కెలు విరగ్గొట్టించుకున్న కుక్క కథ మీకు తెలిసే ఉంటుంది. సరుకు రవాణాకు వాడే టాటా ఏస్ వాహనం సదరు కుక్కలా ఉల్టా పని చేసింది. దాన్ని ఎక్కిన జనం ఢామ్మని రోడ్డున పడిపోయారు. బండి వెనకవైపు బాడీ మొత్తం విరిగి రోడ్డుపై పడిపోవడంతో, కోళ్లలాగా కిందపడిపోయారు.
ఎక్కడ జరిగిందో తెలియదుగాని ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ట్విస్ట్ ఏమింటంటే కిందపడిపోయిన జనం దెబ్బలు లేకుండా చక్కగా లేచి దులుపుకోవడం. టాటా ఏస్ మలుపు తిరుగుతూ నెమ్మదిగా వెళ్లడంతో వీళ్లు ప్రాణాలు దక్కించుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. సరుకు రవాణాకు వాడాల్సిన వాహనంలో ప్రయాణికులను ఎక్కించుకోవడం సరికాదన్నారు.
Goods Vechile's are not Meant for Transporting the People… #RoadSafety #TSRTCRoadSafety#roadaccident @TelanganaCOPs @HYDTP @Rachakonda_tfc @spsircilla @cp_nizamabad @cpwrl @dtptraffic @KhammamCp @adilabad_sp #safety pic.twitter.com/PRIyymtsZO
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) June 1, 2022