టాటా సంచలన నిర్ణయం.. ఉద్యోగుల వేతనాల్లో కోత - MicTv.in - Telugu News
mictv telugu

టాటా సంచలన నిర్ణయం.. ఉద్యోగుల వేతనాల్లో కోత

May 25, 2020

tataa

కరోనా సంక్షోభం ఎవరినీ వదిలిపెట్టడం లేదు. చాలా కంపెనీలు ఆదాయం తగ్గడంతో ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. తాజాగా టాటా గ్రూప్‌ కూడా ఎన్నడూ లేని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పని చేసే సీఈవోల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. ఇది దాదాపు 20 శాతం వరకు ఉంటుందని వెల్లడించింది. దీంతో ఆ సంస్థ చరిత్రలోనే ఉద్యోగులు జీతాల్లో కోత విధించడం తొలిసారి. 

టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, టాటా క్యాపిటల్, వోల్టాస్  ఇతర  కంపెనీల సీఈవోలు, ఎండీలు వారి వారి జీతాలను తగ్గించుకోనున్నారు. ఇందులో ముందుగా  టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ ఈ ప్రకటన చేశారు. తన జీతంలో కోత విధించుకుంటానని ప్రకటించారు. వీటితో పాటు ఈ ఏడాది తీసుకోబోయే బోనస్‌లను కూడా సీఈవోలు వదలుకోనున్నారట. మహమ్మారి ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.  కాగా టాటా గ్రూప్ కంపెనీలలో సీఈవో వేతనాలు ఎక్కువగానే తగ్గాయి.