Tata Group has announced a new name for Air India
mictv telugu

ఎయిరిండియాకు కొత్త పేరు ప్రకటించిన టాటా గ్రూప్

September 15, 2022

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థగా ఉన్న ఎయిరిండియాను ఇటీవల ప్రతిష్టాత్మక టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రూపొందించిన టాటా గ్రూప్.. అందులో భాగంగా గురువారం కీలక నిర్ణయాలు వెల్లడించారు. అందులో ఎయిరిండియా పేరు మార్పుతో పాటు కొత్తగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఓ ప్రకటనలో తెలిపారు.

ఎయిరిండియా పేరును విహాన్‌‌గా మారుస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎయిరిండియా విహాన్ పేరుతో ప్రయాణీకుల ముందుకు రానున్నట్టు పేర్కొంది. అలాగే రాబోయే ఐదేళ్లలో దేశీయ మార్కెట్లో తన వాటాను కనీసం 30 శాతం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో ఎయిర్ ఇండియా వాటా 8 శాతంగా ఉంది. అంతేకాక, భారతీయ మూలాలతో ప్రపంచ స్థాయి గ్లోబల్ విమానయాన సంస్థగా మరోసారి సత్తా చాటేందుకు, అంతర్జాతీయ మార్కెట్లో స్థిరపడేందుకు సమగ్రమైన ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రణాళికను ఆవిష్కరించినట్టు వివరించింది. కాగా, ఎయిర్ ఇండియా ప్రభుత్వ సంస్థగా మారక ముందు టాటా గ్రూపు ఆధ్వర్యంలో నడిచింది. తర్వాత సుదీర్ఘ కాలానికి ప్రభుత్వం తన వాటాను అమ్మేయగా వాటిని టాటా గ్రూప్ సొంతం చేసుకుంది.