లోయలో పడ్డ టాటా సుమో.. 12 మంది దుర్మరణం.. వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

లోయలో పడ్డ టాటా సుమో.. 12 మంది దుర్మరణం.. వీడియో

November 18, 2022

ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. టాటా సుమో అదుపు తప్పి 700 మీటర్ల లోతు ఉన్న లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మొత్తం 12 మంది చనిపోయారు. ఇందులో పది మంది పురుషులు అయితే ఇద్దరు మహిళలు ఉన్నారు.

 

అంతెత్తు నుంచి పడిపోవడంతో అందరూ చనిపోగా కారు ముక్కలుముక్కలయింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. జోషిమఠ్ నుంచి కిమాన గ్రామం వెళ్లే సమయంలో పల్ల జఖోల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 

ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్ధించారు.