టాటా టెలి నుంచి 5 వేల మందికి ఉద్వాసన 

దిగ్గజ కంపెనీలు ఆర్థిక భారంతో ఉద్యోగులను వదలించుకుంటున్నాయి. లాభాలు గడించినప్పుడు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లోకి తీసుకుని నష్టం రాగానే వారిని వీధులపాలు చేస్తున్నాయి.  టాటా సన్స్‌ గ్రూప్‌కు చెందిన టాటా టెలీ సర్వీసెస్‌(టీటీఎస్‌ఎల్‌) తన ఉద్యోగుల్లో 5 వేల మందిని ఇంటికి పంపడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరికి  3 నుంచి ఆరు నెలల నోటీసు ఇస్తారని సమాచారం. ఈ గడువుకు ముందే ఉద్యోగం మానేయాలనుకున్న వారికి తగిన ప్యాకేజీ, వీఆర్‌ఎస్‌ కూడా ఉంటుంది. కంపెనీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం వల్లే తాజా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పారు. టాటా గ్రూప్‌లోని ఇతర కంపెనీల ఉద్యోగులతో పోలిస్తే టీటీఎస్‌ఎల్‌ ఉద్యోగులను ఇలా బజారున పడేయడం అనుచితమని ఆ కంపెనీ అధికారి ఒకరు చెప్పారు.

SHARE