ఎయిర్‌టెల్ చేతికి టాటా 

టాటా టెలీ సర్వీస్ తమ వైర్‌లెస్ వ్యాపారాలకు టాటా చెప్పబోతోంది. వైర్‌లెస్ మొబైల్ వ్యాపారాలను టెలికం దిగ్గజం ఎయిర్ టెల్‌కు అప్పగించబోతోంది టాటా. పీకల్లోతు నష్టాల్లో ఉన్న టాటా టెలీ సర్వీసెస్, భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్‌లో విలీనం అవుతుందని ఇరు కంపెనీలు అధికారికంగా ప్రకటించాయి. భారతీ ఎంటర్‌ప్రైజ్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌తో నాలుగు నెలల పాటు చర్చలు జరిపిన టాటా గ్రూప్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందంతో టాటాకు చెందిన రూ.10 వేల కోట్ల స్పెక్ట్రమ్‌ బాధ్యతను కూడా భారతీ ఎంటర్ ప్రైజ్ తీసుకోబోతోంది. టాటా టెలి దేశవ్యాప్తంగా 19 సర్కిళ్లలో 800, 1800, 2100 మెగాహెడ్జ్‌ బ్యాండుల్లో 180 మెగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. నష్టాల నేపథ్యంలో 5వేల మంది ఉద్యోగులను తొలగించాని టాటా టెలీ సర్వీస్ నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే. ఎయిర్‌టెల్ టేకోవర్ నేపథ్యంలో వీరి ఉద్యోగాలు నిలబడే అవకాశముంది.

SHARE