నోయిడాలో భారీ ఎయిర్‌పోర్ట్.. నిర్మించనున్న టాటా - MicTv.in - Telugu News
mictv telugu

నోయిడాలో భారీ ఎయిర్‌పోర్ట్.. నిర్మించనున్న టాటా

June 3, 2022

ఉత్తరప్రదేశ్‌ పరిధిలోని ఢిల్లీ నగరానికి దగ్గరగా ఉన్న నోయిడాలో భారీ ఎయిర్ పోర్టు నిర్మాణం కానుంది. దేశంలో అతిపెద్దదిగా నిలిచే ఈ విమానాశ్రయ నిర్మాణ టెండరుని టాటా సంస్థ దక్కించుకుంది. ఏడాదికి కోటీ 20 లక్షల మంది ప్రయాణించేలా దీనిని నిర్మిస్తున్నారు. ఒప్పందంలో భాగంగా టెర్మినల్, రన్ వే, రోడ్లు, అనుబంధ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను టాటా గ్రూపు నిర్మిస్తుందని యమునా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. మొత్తం 1334 హెక్టార్ల భూమి విమానాశ్రయ నిర్మాణానికి కేటాయించారు. తొలిదశలో రూ. 5700 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. సింగిల్ రన్ వేతో నిర్మితమవుతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు 2024 నాటికి పూర్తవుతుందని తెలిపింది.