Tata's sensational decision .. Employees go home
mictv telugu

టాటా సంచలన నిర్ణయం.. ఇక ఉద్యోగులు ఇంటికే

June 2, 2022

Tata's sensational decision .. Employees go home

ప్రముఖ విమాన సంస్థ ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థలో పర్మినెంట్‌ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారికి వీఆర్‌ఎస్‌ (స్వచ్ఛంద విరమణ) ఆఫర్‌‌ను ప్రకటించింది. ఈ వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఉద్యోగులకు ప్రత్యేకంగా ప్రోత్సహకాల్ని అందిస్తామని సూచించింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోవాలని టాటా సిద్దమైంది. ఈ నిర్ణయంతో ఎయిర్ ఇండియాలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఇంటి బాటపట్టే పరిస్థితి ఏర్పడింది.

ఇటీవలే ఎయిర్ ఇండియాను టాటా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టాటా గ్రూప్‌ అధినేత రతన్‌ టాటా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఇండియాలో 55 సంవత్సరాల వయస్సున్న (గతంలో 40 ఏళ్లు) క్యాబిన్‌ క్రూ సిబ్బందితోపాటు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ తీసుకోవచ్చని ప్రకటించారు. ఎవరైతే జూన్‌ 1 నుంచి జులై 31వరకు స్వచ్ఛంద రాజీనామా చేస్తారో, ఆ ఉద్యోగులకు ఒకేసారి టాటా గ్రూప్‌ ఎక్స్‌గ్రేషియా, బోనస్‌లు ఇస్తామని ఎయిర్ ఇండియా చీఫ్‌ హెచ్‌‌ఆర్‌ అధికారి సురేష్‌ దత్‌ త్రిపాటీ తెలిపారు.

మరోపక్క ఎయిరిండియాలో మొత్తం 12,085 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 8,084 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు, 4,001 కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 1,534 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు ఎయిరిండియా సీఎండీ రాజీవ్‌ బన్సాల్‌ ఓ నివేదికను విడుదల చేశారు. కేంద్రం నిర్వహణలో ఉన్న ఎయిరిండియాను తాము దక్కించుకుంటే సంవత్సరం పాటు ఉద్యోగులు విధుల్లో కొనసాగుతారని అన్నారు. రెండో ఏడాదిలో ఉద్యోగులు తొలగించడం, వీఆర్‌ఎస్‌కు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ వీఆర్‌ఎస్‌ నిర్ణయం వల్ల ఉద్యోగుల తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. పదవి విరమణ చేస్తే, నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు.