కొత్త పార్లమెంట్ కాంట్రాక్ట్ టటాకే.. బడ్జెట్ ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త పార్లమెంట్ కాంట్రాక్ట్ టటాకే.. బడ్జెట్ ఎంతంటే?

September 16, 2020

tatas Win Contract To Build New Parliament Building For ₹ 861.9 Crore

దేశ రాజధానిలో నిర్మించే కొత్త పార్లమెంటు భవన నిర్మాణం కాంట్రాక్ట్ మన దేశానికే చెందిన కంపెనీకి దక్కింది. విదేశీ కంపెనీలను వెనక్కి నెట్టి టాటా కంపెనీ ఈ పని దక్కించుకుంది. రూ. 861.90 కోట్ల రూపాయలకు ఈ ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రజాపనుల విభాగం ఈ రోజు కాంట్రాక్ట్ పాట పాడింది. లార్సెన్ అండ్ టర్బో రూ. 865 కోట్లకు కోట్ చేయగా అంతకు మూడు కోట్లకు టాటాలు కోట్ చేశారు. 

ఏడాదిలోగా భవన నిర్మాణం పూర్తవుతుందని తెలుస్తోంది. త్రికోణ ఆకారంలో నిర్మిస్తారని, సుందరీకరణతోపాటు ఇతర ఖర్చులు కలిపి రూ. 940 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం తెలిపింది. బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన ప్రస్తుతం పార్లమెంటు పాతబడిందని, భవిష్యత్ అవసరాల కోసం పెద్ద భవనం కావాలని కేంద్రం కొత్త భవనం నిర్మిస్తోంది. పాత భవనానికి మరమ్మతులు చేసి వాడుకుంటారు. 1926లో దీని నిర్మాణం పూర్తయింది. తర్వాత రెండు అంతస్తులు నిర్మించారు. అయినా అది చాలదని ప్రభుత్వం భావిస్తోంది.