సమంతను బాగా ఇబ్బంది పెడుతున్న నాగ చైతన్య - Telugu News - Mic tv
mictv telugu

సమంతను బాగా ఇబ్బంది పెడుతున్న నాగ చైతన్య

June 10, 2022

విడాకుల తర్వాత సమంత నాగ చైతన్య వల్ల బాగా ఇబ్బంది పడుతోంది. అయితే ప్రత్యక్షంగా కాదు. పరోక్షంగా. వివాహ బంధంలో ఉన్నప్పుడు భర్త మీద ప్రేమతో సమంత తన ఒంటి మీద మూడు చోట్ల చైతన్య అని పచ్చబొట్టు పొడిపించుకుంది. దానిని విడాకుల తర్వాత తొలగించడానికి కుదరడం లేదు. లేజర్ చికిత్స ద్వారా తీయించుకుందామనుకున్నా, వాటి వల్ల మచ్చలు ఏర్పడతాయి. అసలే గ్లామర్ ఫీల్డాయే. మచ్చలు ఉంటే అవకాశాలు తగ్గిపోతాయనే భయంతో ఆ టాటూలను అలాగే ఉంచేసింది సమంత. ఈ మధ్య పలు ప్రాడక్ట్‌లకు ప్రచార కర్తగా ఉంటున్న సమంత, ఆయా సంస్థల వీడియోల్లో వివిధ రకాలుగా కన్పించాల్సి ఉంది. ఇందులో భాగంగా ఓ బ్రిటీష్ కంపెనీకి చెందిన బట్టలు, బ్యాగులతో వీడియో షూట్ చేశారు. వాటిని కంపెనీ వారు సోషల్ మీడియాలో పెట్టగా, టాటూలు మరోసారి ప్రముఖంగా కనిపించాయి. మొత్తం మూడు టాటూలు ఒకటి మెడ వెనుక, మరోటి నడుం పైన, ఇంకోటి మణికట్టు మీద ఉన్న టాటూలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో ఇక సమంత సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తున్నంత కాలం చైతన్య వల్ల ఆమె ఇబ్బంది పడుతూనే ఉంటుందన్న మాట. అయితే కొంతకాలం క్రితం సమంత ఈ విషయంపై తన అశక్తతను వ్యక్తపరిచింది. ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయిలైనా, అబ్బాయిలైనా తనలా టాటూలు వేసుకోవద్దని సూచించింది. ఆ బంధం తెగిపోయినప్పుడు వాటిని తీయించడం సాధ్యం కాకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది.