బకాయిలు చెల్లించకుండానే పన్ను వసూలు చేశారు : ఏపీ కానిస్టేబుల్ ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

బకాయిలు చెల్లించకుండానే పన్ను వసూలు చేశారు : ఏపీ కానిస్టేబుల్ ఆగ్రహం

June 15, 2022

తమకు రావాల్సిన బకాయిలను చెల్లించకుండానే చెల్లించినట్టు రికార్డుల్లో చూపించి వాటిపై పన్ను కూడా వసూలు చేసుకున్నారని ఓ కానిస్టేబుల్ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలను సత్వరమే చెల్లించి తమను కాపాడాలంటూ ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ మంగళవారం పోలీసు ఆఫీసు ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద ఈ నిరసన చేపట్టారు. ప్లకార్డుపై ‘ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారూ.. సేవ్ ఏపీ పోలీస్. గ్రాంట్ ఎస్‌ఎల్ఎస్, ఏఎస్ఎల్ఎస్ ఏరియర్స్.. సామాజిక న్యాయం ప్లీజ్’ అంటూ రాసి ఉంది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మాకు మూడు సరెండర్ సెలవులు, అదనపు సరెండర్ సెలవులకు సంబంధించి డబ్బులు రాలేదు. అలాగే 14 నెలల రవాణా భత్యం, ఆరు డీఏ బకాయిలు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఈ డబ్బులను ఇవ్వకుండానే ఇచ్చినట్టు రికార్డుల్లో రాసుకొని, వాటిపై పన్నులు కూడా వసూలు చేసుకున్నార’ని ఆరోపించారు.