పెంపుడు కుక్కలకూ పన్ను - MicTv.in - Telugu News
mictv telugu

పెంపుడు కుక్కలకూ పన్ను

October 24, 2017

మనం కొనే అన్ని వస్తువులపైనా పన్నులు ఉంటాయి.  ఇప్పుడు కొత్తగా వచ్చిన జీఎస్టీ చూపుతున్న చుక్కలు కూడా అందరికీ తెలిసిందే. కానీ తాజాగా పెంపుడు జంతువులపై కూడా పన్నులు విధించబోతున్నారు. కానీ ఇది మన దగ్గర కాదు పంజాబ్  రాష్ట్రంలో. బ్రాండింగ్ కోడ్ పేరిట గుర్తింపు చిహ్నలను లేదా నంబర్లను పెంపుడు జంతువులకు కేటాయించటంగానీ, అవసరమైతే జంతువుల శరీరాల్లో మైక్రో చిప్‌లను అమరుస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.

కుక్క, పిల్లి, గుర్రం, పంది, బర్రె, ఆవు, ఏనుగు, ఒంటె, గుర్రం.. ఇలా పెంచుకునే జంతువులన్నీ తాజా ఆదేశాల పరిధిలోకి వస్తాయి. కోళ్లు, చిలుకలు, పావురాలు వంటి పక్షులకు ఇది వర్తిస్తుందో లేదో స్పష్టత ఇవ్వలేదు. 200  నుంచి 500 రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ పన్ను కట్టకపోతే మునిసిపల్ అధికారులు పెంపుడు జంతువులను స్వాధీనం చేసుకుంటారు. జంతు ప్రేమికులు ఈ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరదాగా ఇంట్లో పెంచుకునే జంతువులపై పన్నులు విధించటమేంటని కొందరు నిలదీస్తుంటే..  డెయిరీ ఫామ్‌లు నిర్వహించే వారి పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో గోవా, కేరళలోనూ ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలే చేయగా.. నిరసనలు వెల్లువెత్తడంతో దాన్ని విరమించుకున్నారు.