ఇందిరా గాంధీ జన్మించిన ఇంటికి రూ.4.35 కోట్ల పన్ను - MicTv.in - Telugu News
mictv telugu

ఇందిరా గాంధీ జన్మించిన ఇంటికి రూ.4.35 కోట్ల పన్ను

November 20, 2019

దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జన్మించిన ఇంటికి రూ. 4.35 కోట్ల పన్ను విధించారు మున్సిపల్ అధికారులు.  ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న ఆనంద్ భవన్‌కు పెద్ద మొత్తంలో ఇంటి పన్ను వచ్చింది. నాన్ రెసిడెన్షియల్ కేటగిరి కింద టాక్స్ నోటీసులు ఇచ్చినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. 2013 నుంచి పన్ను చెల్లించకపోవడంతో ఇంత మొత్తంలో విధించాల్సి వచ్చినట్టుగా తెలుస్తోంది. 

Indira Gandhi.

కాగా ఇందిరా గాంధీ ఇదే నివాసంలో జన్మించారు. ఆమెకు గుర్తుగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నేతృత్వంలో జవహర్‌లాల్ నెహ్రు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆనంద్ భవన్ నివాస సముదాయంగా ఉంటోంది. చాలా రోజులుగా దీనిపై విధించిన పన్ను కట్టకపోవడంతో ఆస్తి చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారు. అయినా ఎటువంటి స్పందన లేకపోవడంతో పన్ను మదింపు వేసి తాము నోటీసు ఇచ్చారు.

దీనిపై స్థానిక కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ట్రస్ట్‌ కోసం నిర్వహిస్తున్న ఆనంద్ భవన్‌పై ఎటువంటి పన్ను వేయరాదని మాజీ మేయర్ చౌదరి జితేంద్రనాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీనికి అన్ని రకాల పన్ను మినహాయింపులు ఉంటాయని గుర్తు చేశారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తోందని మండిపడ్డారు.