ట్యాక్సీవాలా.. మే 18న ఎక్కించుకుంటాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ట్యాక్సీవాలా.. మే 18న ఎక్కించుకుంటాడు..

March 24, 2018

కుర్ర స్మార్ట్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ట్యాక్సీవాలా’ లోగో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ గేర్ వేసిన విజయ్ ఈ రోజు ఫస్ట్లుక్‌తో ముందుకొచ్చాడు. మే నెల 18న ఈ మూవీ విడుదలవుతుందని తెలిపాడు. will pick you up on May 18th. Teaser out soon అని ఈ లుక్‌కు కాప్షన్ తగిలించారు. ట్యాక్సీవాలాగా తన క్యాబ్ ముందు ప్యాంటులో జేబులు పెట్టుకుని విజయ్ ఆకట్టుకుంటున్నాడు. జీఏ2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో విజయ్‌తో ప్రియాంకా జవల్కర్ జోడీ కట్టింది.

అర్జున్ రెడ్డి’ హిట్‌తో మాంచి హీట్ మీదున్న విజయ్ దేవరకొండ చేతిలో ‘నోటా‘ సహా ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అతని తాజా చిత్రం ఏం మంత్రం వేసావెజనానికి నచ్చని సంగతి తెలిసిందే. అయితే అది అర్జున్ రెడ్డికి ముందే మొదలైన సినిమా కనుక ఎవరూ పట్టించుకోలేదు. ఇక ట్యాక్సీవాలా ఎలా ఉంటాడోనని అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున ఈ మూవీలో రవివర్మ, కళ్యాణి తదితరులు నటిస్తున్నారు.