Taxpayers resent money wasted on freebies, says PM Modi
mictv telugu

ప్రజలకు ఉచితాలను పంచితే.. పన్ను చెల్లించేవారికి బాధ

October 23, 2022

ట్యాక్స్ పేయర్స్.. తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఉచితాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. ‘‘పన్ను చెల్లింపుదారులు తమ డబ్బు సరైన చోట ఖర్చవుతుందని భావించినప్పుడు సంతోషిస్తారు. సరైన టైమ్‌కి పన్ను చెల్లిస్తూనే ఉంటారు. ఈ రోజు దేశంలోని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు కరోనా కాలంలో కోట్లాది మందికి ఆహారం అందించడం ద్వారా చేస్తున్న గొప్ప సేవతో సంతృప్తి చెందారు… అదే పన్ను చెల్లింపుదారులు వారి నుంచి వసూలు చేసిన డబ్బును.. ప్రజలకు ఉచితాల పేరుతో పప్పు బెల్లంలా పంచుతుంటే చాలా బాధపడ్డారు’’ అని వ్యాఖ్యానించారు

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అందజేసే ఉచిత పథకాలపై ప్రధాని వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులను ఉద్దేశించి శనివారం విర్చువల్‌గా ప్రధాని మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతికి సంబంధించిన సంక్షేమ పథకాలకు, పన్ను రూపంలో వచ్చిన సొమ్మును ఖర్చు చేస్తే వారు సంతృప్తి చెందరని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఉచితాలను వ్యతిరేకిస్తూ చాలా మంది పన్నుచెల్లింపుదారుల నుంచి తనకు లేఖలు వెల్లువలా వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ‘ఉచిత సంస్కృతి’సవల్‌లో చేరడానికి ఎక్కువ మంది సిద్ధమతున్నారని చెప్పారు.