డ్రగ్స్ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

April 8, 2022

fbfcb

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాదులో డ్రగ్స్ ఉదంతాలు పెరిగిపోతుండడంపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2015లో వెలుగు చూసిన టాలీవుడ్‌ డ్రగ్స్ సినిమాలో కేసీఆర్ విలన్ అయితే, ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ హీరోగా నిలిచారు. అప్పుడే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపి ఆ సినిమా కథను ముగించి ఉంటే ఈ రోజు ఈ కొత్త సినిమా మొదలు పట్టి ఉండేవారు కాదు. అప్పటి కేసు ఏమైంది? ఏం చర్యలు తీసుకున్నారు? ఈడీ దర్యాప్తుకు కేసీఆర్ ఎందుకు సహకరించట్లేదు? అప్పటి కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు కెల్విన్ చాలా మంది పేర్లు చెప్పాడు. వారంతా ఏమయ్యారు? హైదరాబాదును కేసీఆర్ డ్రగ్స్‌కు అడ్డాగా మార్చేశారు. పంజాబులో ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది డ్రగ్స్ వల్లే. అదే పరిస్థితి తెలంగాణలో రిపీటవుతుంద’ని మండిపడ్డారు.