టీసీఎస్ శుభవార్త..ఏకంగా 40 వేల ఉద్యోగాలు - MicTv.in - Telugu News
mictv telugu

టీసీఎస్ శుభవార్త..ఏకంగా 40 వేల ఉద్యోగాలు

July 14, 2020

TCS plans to hire 40,000 freshers in India

ఈ విపత్కర సమయాల్లో ఎన్నో కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. కొత్త నియామకాలను చేసుకోవడానికి ఏ కంపెనీ ధైర్యం చేయడం లేదు. ఇలాంటి సమయంలో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్‌) ఓ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. 

త్వరలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్ ద్వారా ఏకంగా 40 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా కంపెనీ ఆదాయం తగ్గినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇండియాలో 40 వేలమంది లేదా 35-45 వేల మధ్య అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీసీఎస్‌ గ్లోబల్ హెచ్ఆర్‌డీ హెడ్ మిలింద్ లక్కాడ్ వెల్లడించారు. వారానికి 8 నుంచి 11 వేల మందిని ఆన్‌లైన్‌ ద్వారా ఎంపిక చేయనున్నట్టు వివరించారు. ఫ్రెషర్లతోపాటు అనుభవం కలిగిన ప్రొఫెషనల్స్‌ను కీలక ఉద్యోగాలకు ఎంపిక చేస్తామన్నారు.