టీడీపీని వదలని 23 సంఖ్య.. జూర్‌నగర్ లోనూ - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీని వదలని 23 సంఖ్య.. జూర్‌నగర్ లోనూ

October 25, 2019

Tdp .

టీడీపీ పార్టీని 23 సంఖ్యా వదలడం లేదు. చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు 23మంది వైసీపీ ఎమేల్యేలు టీడీపీలోకి వెళ్లారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాల్లో గెలుపొందింది. దీనిని ఏపీ సీఎం జగన్ దేవుడు రాసిన స్క్రిప్ట్‌గా పలుమార్లు అభివర్ణించాడు. 

తాజాగా తెలంగాణలోని హుజూర్ నగర్‌లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లను, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన సీట్లను పోలుస్తూ, వైసీపీ పార్టీ నాయకుడు పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హుజూర్‌నగర్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి కిరణ్మయికి 1,895 ఓట్లు రాగా, ఈ సంఖ్యలోని అంకెలన్నీ కలిపితే 23 వస్తుందని, అన్నే సీట్లను ఏపీలో ఆ పార్టీ గెలుచుకుందని ఆయన గుర్తు చేశారు. 23 సంఖ్య తెలుగుదేశం పార్టీని నడిపిస్తోందన్నారు. హుజూర్ నగర్‌లో టీడీపీకి వచ్చిన ఓట్లు 1895. 1+8+9+5=23. భగవంతున్ని భక్తుడిని అనుసంధానించేది అంబికా దర్బార్ బత్తి.. ఓటమిని తెలుగుదేశాన్ని అనుసంధానించేది 23 అని ఆయన ట్వీట్ చేశారు.