వైఎస్ ఫ్యామిలీకి భద్రత కోసం అమిత్‌షాకి టీడీపీ విజ్ఞప్తి - MicTv.in - Telugu News
mictv telugu

వైఎస్ ఫ్యామిలీకి భద్రత కోసం అమిత్‌షాకి టీడీపీ విజ్ఞప్తి

July 1, 2022

వైఎస్ కుటుంబంలో ఎవరు ఎవరిని ఎప్పుడు చంపుతారో తెలియదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఆ నింద టీడీపీపై వేసారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాబోతున్నందున ఎవరు ఎవరిని చంపుతారో తెలియట్లేదన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ విజయ లక్ష్మి, షర్మిల, అనిల్‌లకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డిది హత్య కాదు, రిలయన్స్ వాళ్లే చంపించారని అప్పట్లో జగన్ తన పత్రికలో రాయించుకున్నారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖేష్ అంబానీ అడిగితే రాజ్యసభ సీటు ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ మరణంపై ఒక్క సిట్ కూడా వేయలేదని విమర్శించారు. 2019 డిసెంబర్‌లో స్థాపించిన ఆదాన్ డిస్టిలరీ కంపెనీ జగన్ సూట్ కేసు కంపెనీ అని వెంకట రమణా రెడ్డి ఆరోపించారు.