TDP asks the response of YCP leaders on the ED arrest of Vijayasai Reddy son-in-law’s Brother
mictv telugu

విజయసాయి రెడ్డికి షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అల్లుడి అరెస్ట్

November 10, 2022

అధికారం అడ్డుపెట్టుకొని వేల ఎకరాల్లో విశాఖ భూములను కబ్జా చేశారంటూ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఈసారి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన బంధువు అరెస్ట్ కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురువారం ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్ర.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు అని తెలిసింది.

ఈ విషయాన్ని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మీడియాకు వివరిస్తూ.. శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. మద్య నిషేధంపై గొప్పలు చెప్పే జగన్ ఈ అరెస్ట్ పై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం అయిన తర్వాత అంచెలంచెలుగా మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. మూడున్నరేళ్లుగా శాండ్, మైన్, వైన్, ఇసుక, మద్యం, బియ్యం, అంబులెన్స్ మాఫియాలు నడిపిన జగన్ రెడ్డి వైద్య రంగం, ప్రజారోగ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారాసిట్మాల్ కూడా దొరకని దుస్థితికి జగన్ రెడ్డి పాలనా వైఫల్యం, నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.