Tdp chief Chandrababu naidu janasena chief pawan Kalyan press meet
mictv telugu

ఈరోజు పవన్‌కు రేపు, మీకు.. చంద్రబాబు వార్నింగ్

October 18, 2022

Tdp chief Chandrababu naidu janasena chief pawan Kalyan press meet

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరముంని విపక్ష టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్ పర్యటనకు ఎదురైన నిరసనలకు ఆయన తీవ్రంగా ఖండించారు. పవన్‌కు సానుభూతి తెలిపేందుకే ఆయనను కలిశాననన్నారు. మంగళవారం విజయవాడలో పవన్, చంద్రబాబు భేటీ అయ్యారు. తర్వాత విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు.

చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘విశాఖ పరిణామాలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. ఈ రోజు పవన్‌ను అడ్డుకున్నారు. రేపు మిమ్మల్ని అడ్డుకుంటారు. ఇదేనా ప్రజస్వామ్యం? మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజా సమస్యల పరిష్కారం ప్రయత్నిస్తున్నవారిని వేధించడం సరికాదు. వైకాపా దుర్మార్గాలను అడ్డుకోడానికి అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాలని మేం నిర్ణయం తీసుకున్నాం. ముందు కలసి పనిచేద్దాం. తర్వాత పోటీపై మాట్లాడుకుందాం’ అని బాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని పవన్ కల్యాణ్ ఆందోన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతున్న పార్టీల నాయకుల గొంతు నొక్కుతున్నారన్నారు. తనకు సంఘీభావం తెలిపినందుకు బాబుకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.