నందమూరి తారకరత్న మరణంతో టాలీవుడ్ సినీఇండస్ట్రీతోపాటు టీడీపీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తారక రత్న మరణవార్త తెలిసి పార్టీ కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తారకరత్న ఇకలేరన్న విషయాన్ని నందమూరి కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. 23రోజులుగా చికిత్స పొందుతున్న తారకరత్న,..క్షేమంగా తిరిగివస్తాడని అంతా భావించారు. కానీ అంతలోనే ఆయన అనంత లోకాలకు వెళ్లడాన్ని తట్టుకోలేకపోతున్నారు. తారకరత్న మాకు దూరమై మా కుటుంబాల్లో విషాదం నింపారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు బావోద్వేగానికి లోనయ్యారు. నన్ను బావా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక వినిపిందని..లోకేష్ ఎమోషనల్ అయ్యారు.
కాగా తారక రత్నను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కుటుంబ సభ్యులు, అభిమాను ప్రార్థనలు, డాక్టర్ల వైద్యం కూడా ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. 23రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడారు తారకరత్న.చివరికి మాకు దూరం అయ్యాడంటూ చంద్రబాబు అన్నారు.
నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు.(1/2) pic.twitter.com/VfyfdHfKnF
— N Chandrababu Naidu (@ncbn) February 18, 2023
బావ అని పిలిచే ఆ గొంతు వినిపించదు. నీకు నేనున్నానంటూ నాతో వేసిన అడుగు చప్పుడు ఇక ఆగిపోయింది. యువతేజం తారకరత్నం మరణం మా కుటుంబానికి, టీడీపీకి తీరని లోటు అని లోకేషన్ ఎమోషనల్ అయ్యారు.
బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు.(1/2) pic.twitter.com/MLLlp3p60G
— Lokesh Nara (@naralokesh) February 18, 2023