tdp ex minister ayyanna patrudu got bail
mictv telugu

సీఐడీకి ఎదురు దెబ్బ..అయ్యన్నకు బెయిల్

November 3, 2022

tdp ex minister ayyanna patrudu got bail

ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ భూమిని ఆక్రమించారనే ఆరోపణలతో అరెస్టైన అయన్న పాత్రుడికి బెయిల్ లభించింది. అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్ రిమాండ్‌కు విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. నిందితులకు సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి ఈ కేసులో సీఐడీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టవచ్చంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల కింద గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు రాజేశ్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసారు. నిందితులిద్దరీ వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రానికి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసులో నిందితులపై మోపిన ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని తేల్చారు. దీంతో నిందితులకు అక్కడికక్కడే బెయిల్ మంజూరు చేయడంతో పాటు నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సీఐడీని కోర్టు ఆదేశించింది.అంతకుముందు బెయిల్ కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్ రేపటికి వాయిదా వేసింది.

అయన్నకు బెయిల్ రావడంపై చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేసారు. న్యాయమే గెలిచింది..న్యాయమే గెలుస్తుందంటూ ట్వీట్ చేసారు.