క్షమించండమ్మా.. ఓడిన ఎమ్మెల్యే మర్యాద - MicTv.in - Telugu News
mictv telugu

క్షమించండమ్మా.. ఓడిన ఎమ్మెల్యే మర్యాద

May 25, 2019

ఎన్నికల్లో ఓడిపోతే ఎవరైనా ఏం చేస్తారు? ఇంట్లో కూర్చుని బాధపడతారు. లేకపోతే ఆ బాధను మర్చిపోవడానికి దైవదర్శనాలు, టూర్లకు వెళ్తుంటారు. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.  ఓటమిని అంగీకరించి, ప్రజల్లోకి వెళ్లి, ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసిన బోడె ప్రసాద్‌ ఓటమిపాలయ్యారు. అయినా.. ఆయన ఓడిపోయానని బాధపడకుండా.. శనివారం పెనమలూరు, కంకిపాడు కాలువ కట్టలపై ఒంటరిగా బులెట్ బైక్ నడుపుకుంటూ ప్రతీ ఇంటి వద్ద ఆగుతూ ప్రజలను పలకరించారు. ‘ఓటు వేసినందుకు కృతజ్ఞతలు. నేను ఏ తప్పూ చేయలేదమ్మా.. ఏదైనా తప్పు చేసుంటే క్షమించండి’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.