రాజకీయాల్లో అధికార పక్షం నాయకులు ప్రతిపక్ష నాయకులకు.. వీళ్ళు వాళ్లకు వార్నింగ్ లు ఇచ్చుకోవాలి. అలాంటిది టీడీపీకి చెందిన గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గ యువతకు వార్నింగ్ ఇస్తున్నాడు.
గురజాల నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ సోషల్ మీడియాకు చెందిన యువకులకు యరపతినేని వార్నింగ్ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యువకుల పేర్లు, చిరునామాలు అన్నీ డైరీలో నమోదు చేస్తున్నామని, టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యరపతినేని వ్యాఖ్యలను నియోజకవర్గంలో పలువురు నేతలు తప్పు పడుతున్నారు. కాగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యరపతినేని, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. ఈ కేసుల విచారణను గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.