విశాఖ : వైసీపీ నేత చివరి కోరికను తీర్చిన టీడీపీ - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖ : వైసీపీ నేత చివరి కోరికను తీర్చిన టీడీపీ

July 6, 2022

వైసీపీ నేత చివరి కోరికను టీడీపీ తీర్చిన ఘటన విశాఖ జిల్లా భీమిలిలో జరిగింది. అప్పికొండ అప్పలనాయుడు అనే వ్యక్తి టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగగా, మూడేళ్ల కింద వైసీపీలో చేరారు. వైసీపీ అధికారంలో వచ్చినప్పటికీ ఆ పార్టీకి అప్పలనాయుడు దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ రాజబాబు, పార్టీ ఇతర నేతలు పరామర్శించారు. ఆ సమయంలో వారితో మాట్లాడిన అప్పలనాయుడు వైసీపీలో చేరి పెద్ద తప్పు చేశానని చెప్పుకొని బాధపడ్డారు. అంతేకాక, తాను చనిపోతే అంతిమయాత్రలో టీడీపీ జెండాలను కప్పాలని కోరారంట. అయితే ఆ మరుసటి రోజే ఆయన ప్రాణాలు విడువడంతో ఆయన చివరి కోరిక మేరకు టీడీపీ జెండాలు కట్టి అంతిమ యాత్ర జరిపించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.