TDP has decided to stay away from the joint Nellore district Atmakur by-election
mictv telugu

అసెంబ్లీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గెలుపుకు టీడీపీ సాయం!

May 31, 2022

TDP has decided to stay away from the joint Nellore district Atmakur by-election

ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు బరిలో దిగనున్నారు. దీంతో ఈ ఉప ఎన్నికకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని టీడీపీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో బద్వేలు ఉప ఎన్నికలోనూ టీడీపీ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 22న మేకపాటి గౌతం రెడ్డి హైద్రాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు విక్రమ్ రెడ్డిని ఈ స్థానం నుండి పోటీకి నిలపేందుకు ఏకాభిప్రాయానికి వచ్చారు, మరోవైపు ఈ ఉప ఎన్నికలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. అయితే అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీకి ఈ ఉప ఎన్నికలో జనసేన మద్దతు తెలపనుంది. గతంలో బద్వేలు ఉప ఎన్నికలో కూడా బీజేపీ పోటీచేసి ఓటమి పాలైంది.