టీడీపీ సర్వేలో జగన్ గెలుస్తాడని తేలింది.. - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీ సర్వేలో జగన్ గెలుస్తాడని తేలింది..

April 4, 2018

టీడీపీ శ్రేణులకు ఊహించని షాక్ తగిలింది. ఫేస్‌బుక్‌లో ఆ పార్టీ అభిమానులు నిర్వహిస్తున్న పేజీ నిర్వహించిన సర్వేలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతాడని రిజల్ట్ వచ్చింది. మంగళవారం ఈ పోల్ ప్రారంభమైంది. టీడీపీ పేజీ కనుక దీన్ని చూసేవారు, పోల్‌లో పాల్గొనేవారు చంద్రబాబు నాయుడికే జైకొడతారని భావించారు. అయితే చివరి ఫలితం చూసి కంగుతిన్నారు.మొత్తం 14300 మంది ఓటింగులో పాల్గొనగా జగన్‌కు 51 శాతం, చంద్రబాబుకు 49 శాతం ఓట్లు వచ్చాయి. తేడా స్వల్పమే అయినా టీడీపీ పేజీలో ఇలా రావడం గమనార్హం. దీంతో ఈ పోల్ రిజల్ట్ ను వెంటనే తొలగించారు. వైకాపా అభిమానులు పెద్దసంఖ్యలో ఓట్లేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా, ఇటీవల విదేశాంగ మంత్రి పనితీరుపై కాంగ్రెస్ నిర్వహించిన పోల్‌లో ఆమెకు అనుకూలంగా రిజల్ట్ వచ్చింది. ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో పెద్దపార్టీలతోపాటు చిన్నాచితకా పార్టీలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారానికి తెగబడుతున్నాయి.