టీడీపీకి షాక్..బీజేపీలో చేరిన మాజీ మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీకి షాక్..బీజేపీలో చేరిన మాజీ మంత్రి

October 21, 2019

కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన కమలం గూటికి చేరతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత టీడీపీకి దూరంగా ఉంటున్న ఆయన..బీజేపీ బీజేపీలో చేరి టీడీపీ పార్టీకి షాకిచ్చారు. 

adinarayan reddy.

ఇటీవల ఢిల్లీకి వెళ్లి సోమవారం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆదినారాయణ కాషాయ కండువా కప్పుకున్నారు. ఆదినారాయణ రెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టారు. 2019 ఎన్నికల్లో ఆయన కడప నుంచి పోటీ చేసి ఓడిపోయారు.