tdp leader ayyanna pathrudu tewwts on ycp rajyasabha tickets
mictv telugu

వైసీపీ రాజ్యసభ సీట్లపై అయ్యన్నపాత్రుడు సెటైర్లు

May 17, 2022

tdp leader ayyanna pathrudu tewwts on ycp rajyasabha tickets

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసిన వైసీపీపై టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు సెటైరికల్ ట్వీట్లు చేశారు. నాలుగు సీట్లలో రెండు సీట్లను తెలంగాణ వారికి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. వైసీపీ వైఖరి ఏపీలోని బీసీలను అవమానిస్తోందని విమర్శించారు. ‘రాజ్యసభకు వెళ్లే అర్హత ఏపీలోని 140కి పైగా ఉన్న బీసీ కులాల్లో ఏ ఒక్క నాయకుడికీ లేదా జగన్ రెడ్డిగారు? లేదంటే ఏపీలోని బీసీలు అసలు బీసీలే కాదనుకున్నారా? నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.

మీరేమో సీఎం అయిన మొదటిరోజు నుంచి ఏపీకి చెందిన నీళ్లు, నిధులు, నియామకాలను తెలంగాణకు దోచిపెడుతున్నారు. నిధులు, విధులతో పాటు కూర్చోడానికి కనీసం కుర్చీలు కూడా లేని ఉత్తుత్తి 56 కార్పొరేషన్ల పదవులను ఏపీ బీసీలకు ఇచ్చి, అత్యున్నత రాజ్యసభ స్థానాలను తెలంగాణ వాళ్లకు కట్టబెట్టడమంటే ఏపీలోని బీసీ నేతలకు వెన్నుపోటు పొడవడమే’నంటూ తన అభిప్రాయాలను ట్వీట్ల ద్వారా వ్యక్తపరిచారు.