TDP leader ayyanna patrudu satires on YCP MP Vijay Sai Reddy
mictv telugu

విజయ్‌సాయిరెడ్డికి గడ్డం నెరిసినా ఆ సరసం పోలేదు.. అయ్యన్నపాత్రుడు

May 9, 2022

TDP leader ayyanna patrudu satires on YCP MP Vijay Sai Reddy

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై తనదైన స్టైల్‌లో విరుచుకుప‌డ్డారు టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. తనపై వేసే కౌంటర్లకు ఎన్‌కౌంటర్‌గా సోషల్ మీడియాల సెటైరెకల్ ట్వీట్లు చేశారు .

సోమ‌వారం విజ‌య‌సాయిరెడ్దిని ట్విటర్ వేదికగా టార్గెట్ చేస్తూ.. క్విడ్‌ప్రోకో జాతిపిత‌, సూట్‌కేసు కంపెనీల సృష్టి క‌ర్తా పెద్ద పెద్ద స‌వాళ్లు విసురుతున్నావు. వార్డుమెంబ‌ర్‌గా కూడా గెల‌వ‌ని నికృష్ణ చ‌రిత్ర నీది! `గ‌డ్డం` నెరిసినా సింగిల్‌-మింగిల్ అంటూ ఆ స‌ర‌సం పోలేదు. మీ జాతిర‌త్నం సింగిల్‌గా సింహంలా వచ్చేవాడైతే ఎందుకీ ప‌ర‌దాలు, వల‌లు. ప‌ర్యటించే ప్రాంతంలో 144 సెక్షన్లు, షాపుల మూసివేత‌లు అంటూ సెటైర్లు వేశారు.