ఏపీ రాజకీయం వేడెక్కింది. ఆదివారం పవన్-చంద్రబాబు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వీరి భేటీపై వైసీపీ సర్కార్ తీవ్ర విమర్శలు చేస్తుంది. వైసీపీ నేతలతో పాటు దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా పవన్-చంద్రబాబులను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో ట్వీట్స్ పెడుతున్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై కొద్ది రోజులుగా దర్శకుడు రాంగోపాల్ వర్మ విల్లు ఎక్కుపెడుతున్నారు. గుంటూరు టీడీపీ సభలో మహిళల మృతి ఘటనన నుంచి నిన్నటి భేటీ వరకు చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను కడిగిపారేస్తున్నారు. టీడీపీ నేతలు కూడా వర్మ ట్వీట్లకు గట్టిగా కౌంటరిస్తున్నారు. తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్‌పై బుద్ధా వెంకన్న కొంచెం ఘాటుగా స్పందించారు.
రిప్ కాపులు, కంగ్రాట్స్ కమ్మోళ్లు
చంద్రబాబు, పవన్ భేటీపై రాంగోపాల్‌వర్మ చేసిన ట్వీట్ పొలిటికల్ దుమారం రేపుతోంది. కేవలం డబ్బు కోసం కాపులను కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదని వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు RIP కాపులు, కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఈ ట్వీట్‌పై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాంగోపాల్‌వర్మ కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని..లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు 😔😔😔
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2023
బుద్దా వెంకన్న కౌంటర్
రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌కి.. టీడీపీనేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. వర్మను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. “కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం
డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు..రిప్ ఆర్జీవి, కంగ్రాట్స్ జగన్ రెడ్డి” అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై రాంగోపాల్ వర్మ స్పందించాల్సి ఉంది.
కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం
డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు… #RIPRGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి. @ysjagan @RGVzoomin https://t.co/7XZnvrnraH pic.twitter.com/HcoPZE4V8J— Budda Venkanna (@BuddaVenkanna) January 9, 2023