అందలమెక్కించడం చంద్రబాబు చేసిన తప్పు - బుద్ధా - MicTv.in - Telugu News
mictv telugu

అందలమెక్కించడం చంద్రబాబు చేసిన తప్పు – బుద్ధా

March 16, 2022

 tdp

టీడీపీ నేత బుద్ధా వెంకన్న మంత్రి కొడాలి నానిపై బుధవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని ఓ పిచ్చి కుక్క అంటూ సంబోధించారు. చంద్రబాబు వద్ద బీఫామ్ తీసుకొని ఎన్నికల్లో గెలిచింది మర్చిపోయారా? అంటూ విమర్శించారు. ఇప్పుడు మంత్రి పదవి పోతుందనే భయంతో సిగ్గు లేకుండా సహాయం చేసిన చంద్రబాబునే తిడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విశ్వాసం లేని పిచ్చికుక్కను చేరదీసి అందలమెక్కించడం చంద్రబాబు చేసిన తప్పంటూ పేర్కొన్నారు. ప్యాకేజీలు ఇచ్చి పుచ్చుకునే వ్యక్తిత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు లేదని స్పష్టం చేశారు. పది రోజుల్లో కొడాలి నాని అవినీతి చరిత్ర బయటపెడతానంటూ బుద్ధా వెంకన్న సవాలు చేశారు. కాగా, సభా కార్యకలాపాలకు అడ్డుపడుతుండడంతో అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు.