రాజధాని రగడ..చంద్రబాబు నాయుడు అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

రాజధాని రగడ..చంద్రబాబు నాయుడు అరెస్ట్

January 21, 2020

jfgjf

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రగా మందడం వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులకు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. 

తరువాత పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లే క్రమంలో చంద్రబాబు వాహనాన్ని దారి మళ్లించారు. కరకట్ట వైపు కాకుండా వెంకటాయపాలెం వైపు తీసుకెళ్లారు. మళ్లీ మందడం, కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వైపు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మంగళగిరిలో చంద్రబాబును తరలిస్తున్న వాహనాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. రహదారిపై భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డొంక రోడ్డులో వాహనాన్ని తిప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.