ఐలయ్యకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి - MicTv.in - Telugu News
mictv telugu

ఐలయ్యకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి

October 26, 2017

ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకంపై ఆర్యవైశ్యుల నేత, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఐలయ్య సమాజంలో చీలిక తెచ్చి, కులాల మధ్య చిచ్చుపెట్టారని మండిపడ్డారు.

‘ఇప్పుడు చివరకు కమ్యూనిస్టులు కూడా ఐలయ్య జపం చేస్తున్నారు. వారిలో ఇంత మార్పు తీసుకొచ్చిన ఆయనకు తప్పకుండా నోబెల్ బహుమతి ఇవ్వాలి’ అని ఎద్దేవా చేశారు.  విజయవాడలో ఈ నెల 28న దళిత, బీసీ సంఘాలు కంచ ఐలయ్యకు చేస్తున్న సన్మానాన్ని ఆర్యవైశ్యులు అడ్డుకోరని ఆయన హామీ ఇచ్చారు. అయితే వారిన కించపరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కోమటోళ్లు కూడా ఐలయ్య సమర్థిస్తున్న ద్రావిడ జాతివారేనని, ఆ విషయాన్ని ఆయన బాగా గుర్తుపెట్టుకోవాలని అన్నారు.