‘ఏదో ఎన్నికల ముందు తెలియక హామీ ఇచ్చామంటారా’? - MicTv.in - Telugu News
mictv telugu

‘ఏదో ఎన్నికల ముందు తెలియక హామీ ఇచ్చామంటారా’?

April 25, 2022

కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ట్విట్టర్‌లో స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ను ఎందుకు రద్దు చేయడం లేదు. రాజస్థాన్, చత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేశాయి. ఎన్నికల ముంద ఏదో తెలియక హామీ ఇచ్చామని ఇప్పుడు చెప్పడం హేయమైన చర్య. రాష్ట్రం వైసీపీ పాలనలో అరాచక, ఆటవిక రాజ్యంగా తయారయింది. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయులు అడిగితే వారిని అరెస్టు చేస్తున్నారు. యూటీఎఫ్ ఆందోళనపై ప్రభుత్వ వైఖరి సరికాదు’ అని విమర్శించారు. కాగా, సీపీఎస్ రద్దు కోరుతూ సోమవారం ఛలో విజయవాడకు ఉపాధ్యాయులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ఈ ఆందోళనకు అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు.